This changing weather, protect your family with big discounts! Use code: FIRST10This changing weather, protect your family with big discounts! Use code: FIRST10
ADDED TO CART SUCCESSFULLY GO TO CART
Track your pregnancy journey

గర్భవతులు ప్రసవానికి వెళ్లేందుకు ఉపయోగపడే ఆహార పదార్థాలు

Diet & Nutrition
Written by - Nayana Mukkamalaచివరిగా నవీకరించబడింది: Nov 3, 2023
గర్భవతులు ప్రసవానికి వెళ్లేందుకు ఉపయోగపడే ఆహార పదార్థాలు
Likes48 Likes|
Read time3 min

మహిళలు లేబర్ రూమ్‌లో బిడ్డకు జన్మనివ్వడానికి ఉపయోగపడే ఆహార పదార్థాల జాబితా ఇదే.

పైనాపిల్ (అనాస పండు)

పైనాపిల్ బ్రోమెలైన్ అనే ఎంజైమ్ పైనాపిల్‌లో లభిస్తుంది. ఇది ఇతర ఆహార పదార్థాల్లో చాలా అరుదుగా కనిపిస్తుంది. అందుకే ఇది ప్రత్యేకం. బ్రొమెలైన్ గర్భాశయాన్ని, ప్రసవానికి కారణమైన కండరాలను మృదువుగా చేస్తుంది.

పచ్చి బొప్పాయి

పచ్చి బొప్పాయిలో పపిన్ ఎంజైమ్ ఉంటుంది. బొప్పాయి పండినప్పుడు పపిన్ ఎంజైమ్ పోతుంది. బొప్పాయి ఆకుల్లో, లాటెక్స్‌లో ఉండే ప్రోస్టాగ్లాండిన్, ఆక్సిటోసిన్ సహజ రూపం ప్రసవ సమయంలో సంకోచాలకు ఉపయోగపడుతుంది. గర్భవతిగా ఉన్నప్పుడు బొప్పాయి తినకూడదన్న అభిప్రాయం అందరిలో ఉంటుంది. గర్భస్రావం కావడానికి ఇది కారణం కావచ్చని అంటారు. కాబట్టి బొప్పాయి విషయంలో వైద్యుల సలహా తీసుకోవడం మంచిది.

స్పైసీగా(కారంగా) ఉండే ఆహార పదార్థాలు

మీకు నొప్పి లేకుండా సహజ ప్రసవం కావాలనుకుంటే, మిరియాలు, పండు మిర్చి లాంటి స్పైసీ ఫుడ్‌ని (కారంగా ఉండే ఆహారాన్ని) ప్రెగ్నెన్సీ సమయంలో పూర్తిగా వదిలేయాలి. ప్రసవం సమయంలో శిశువు కిందకు వచ్చినప్పుడు విడుదలయ్యా ఎండార్ఫిన్స్ నొప్పిని తగ్గించడంలో సహాయపడుతుంది. స్పైసీ వంటకాల్లో విడుదలయ్యే క్యాప్సైసిన్ ప్రసవం సమయంలో శరీరం సహజంగా విడుదల చేసే ఎండార్ఫిన్స్ ఉత్పత్తి కాకుండా అడ్డుకొని తల్లిని ఇబ్బంది పెడుతుంది.

బ్లాక్ లికోరైస్

గ్లిసరైజిన్, బ్లాక్ రైస్‌లో కనిపించే మాలెక్యూల్. ప్రోస్టాగ్లాండిన్స్ తయారీని పెంచుతుంది. ఇది కాస్త విరోచనాలకు కారణమైనా, అధికంగా వినియోగిస్తే ప్రేగులపై అధికంగా ప్రభావం చూపించవచ్చు. ఇది తీసుకోవడం వల్ల గర్భాశయం సంకోచించడం ప్రారంభమై, ప్రసవానికి ఉపయోగపడుతుంది.

రెడ్ రాస్ప్‌బెర్రీ ఆకులతో టీ

గర్భవతులు రెడ్ రాస్ప్‌బెర్రీ ఆకులతో చేసిన టీ తాగితే గర్భాశయ కండరాల సంకోచానికి ఉపయోగపడుతుంది. గర్భం దాల్చిన 32వ వారంలో రెడ్ రాస్ప్‌బెర్రీ ఆకులతో చేసిన టీ తాగడం ప్రారంభిస్తే ముందస్తుగా జరిగే ప్రసవం లాంటి సమస్యల్ని నిరోధించవచ్చు.

మీకు ఇది కూడా నచ్చుతుంది: గర్భధారణ సమయంలో (వాటర్ బ్రేకింగ్) ఉమ్మ‌నీటి సంచి విచ్ఛిన్నమవడం

ప్రసవం సమయంలో నొప్పిని తట్టుకోవడం కోసం

ప్రసవం సమయంలో వచ్చే నొప్పుల్ని తట్టుకోవడం కోసం చేయాల్సిందల్లా, ప్రసవం గురించి సాధ్యమైనంత తెలుసుకోవడమే.

ప్రసవం సమయంలో నొప్పి

ప్రసవ సమయంలో నొప్పికి కారణం గర్భాశయ కండరాల సంకోచాలు, గర్భాశయంపై ఒత్తిడే. ఈ అసౌకర్యం కారణంగా బొడ్డు, గజ్జ భాగం, వెనుక భాగంలో తిమ్మిరి, నొప్పి వచ్చినట్టు అనిపించడం లాంటివి చూడొచ్చు. మహిళల్లో పక్కభాగంలో లేదా తొడల్లో అసౌకర్యంగా ఉండటం సాధారణం. శిశువు తల నుంచి మూత్రాశయం వరకు, పేగులపై ఒత్తిడి, బర్త్ కెనాల్, యోని సాగినట్టు కావడం లాంటివి ప్రసవ సమయంలో అసౌకర్యానికి కారణాలు అవుతుంటాయి. ప్రతీ మహిళ ఎదుర్కొనే పురిటి నొప్పులు భిన్నంగా ఉంటాయి. స్త్రీ శరీరం ఎంత నొప్పిని తట్టుకోగలదో, ప్రసవ వేదన అంత స్థాయిలో ఉంటుంది. ప్రసవం దగ్గర పడుతున్నకొద్దీ సంకోచాల మధ్య సమయం తగ్గి మహిళలకు విశ్రాంతి కూడా దొరకదు. ప్రతీ సంకోచానికి నొప్పి పెరిగి మరింత బాధను కలిగిస్తుంది.

స్వయంగా సిద్ధం కావడం

ప్రెగ్నెన్సీకి ముందు లేదా ప్రెగ్నెన్సీ సమయంలో కొన్ని విషయాలు గుర్తుంచుకుంటే ప్రసవం సమయంలో వచ్చే నొప్పిని తగ్గించుకోవచ్చు. ప్రసవం సమయంలో వచ్చే ఒత్తిడిని తట్టుకునేలా మీ శరీరాన్ని, కండరాలను సిద్ధం చేయడానికి, వైద్యులు సూచించిన కొన్ని వ్యాయామాలు చేయాలి. మీరు తరచూ వ్యాయామాలు చేస్తూ ఉంటే ప్రసవం సమయంలో కాస్త తేలికగా ఉంటుంది. అలాగని ఎక్కువగా వ్యాయామాలు చేయొద్దు. ఎలాంటి వ్యాయామాలు చేయాలనేదానిపై మీ వైద్యుల సలహా తీసుకోవడం తప్పనిసరి.

మీకు ఇది కూడా నచ్చుతుంది: ప్రసవాన్ని వేగవంతం చేయడానికి, సురక్షితమైన ప్రసవం జరగడానికి 10 ప్రభావవంతమైన వ్యాయామాలు

Article Posted Under

Related Articles

Related Topics

Medical Disclaimer

This content is for informational purposes only and should not replace professional medical advice. Consult with a physician or other health care professional if you have any concerns or questions about your health. If you rely on the information provided here, you do so solely at your own risk.

foot top wavefoot down wave

AWARDS AND RECOGNITION

Awards

Mylo wins Forbes D2C Disruptor award

Awards

Mylo wins The Economic Times Promising Brands 2022

AS SEEN IN

Mylo featured on Business World
Mylo featured on CNBC
Mylo featured on Financial express
Mylo featured on The Economics Times
Mylo featured on Business Today
Mylo featured on Business World
Mylo featured on CNBC
Mylo featured on Financial express
Mylo featured on The Economics Times
Mylo featured on Business Today
Mylo featured on TOI
Mylo featured on inc42
Mylo featured on Business Standard
Mylo featured on YourStory
Mylo featured on ANI
Mylo Logo

Start Exploring

wavewave
About Us
Mylo_logo
At Mylo, we help young parents raise happy and healthy families with our innovative new-age solutions:
  • Mylo Care: Effective and science-backed personal care and wellness solutions for a joyful you.
  • Mylo Baby: Science-backed, gentle and effective personal care & hygiene range for your little one.
  • Mylo Community: Trusted and empathetic community of 10mn+ parents and experts.